GDWL: రాజోలి గ్రామపంచాయతీలో లేబర్ కార్డు లబ్ధిదారుల కోసం సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రక్తపరీక్షలు సహా మొత్తం 18 రకాల పరీక్షలు నిర్వహించినట్లు సిబ్బంది గిరిధర్ గౌడు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు గుర్తిస్తే ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. శిబిరానికి లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.