WGL: రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 8 నుంచి కళాశాలలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.