MLG: మేడారం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో 30-35 ఏళ్ల వయస్సు గల ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం మృతదేహాన్ని శవపరీక్ష కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నార్లపూర్ పోలీసులు, మృతుడు కాఫీ రంగు ఫుల్ షర్ట్, నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 8712630131, 8712630132 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.