PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన తరాల అరుణ్ కుమార్ భారత సైన్యంలో జవాన్‌గా ఎంపిక కావడంతో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేసిన మంత్రి, దేశ సేవకు యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.