TG: ధాన్యం కొనుగోళ్లపై BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ మొద్దు నిద్రతోనే రైతులకు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు నెల రోజులు ఆలస్యంగా మొదలయ్యాయి. చాలామంది ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. BJP క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరగానే.. ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ఉందనేది ముందే కేంద్రానికి చెప్పాలి’ అని పేర్కొన్నారు.