కడప జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై DEO చర్యలు తీసుకోవాలని AIBSU రాష్ట్ర అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బడులు తెరవకముందే అడ్మిషన్లు, పుస్తకాల పేరుతో పలు సంస్థలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయన్నారు. కనీస వసతులు లేకుండా అపార్ట్మెంట్లో నడిచే స్కూళ్లపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.