AP: ఏలూరు(D) ఉంగుటూరు(M) నల్లమడు శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. దూబచర్ల- చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులు తూర్పుగోదావరి(D) నల్లజర్ల(M) అనంతపల్లికి చెందిన తల్లీకూతుళ్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది.