WGL: పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయని WGL జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దీని ప్రభావం భవిష్యత్ దిగుబడులపై పడుతుందని హెచ్చరించారు. అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.