PDPL: గాలి వాన బీభత్సానికి నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి ధర్మారంలో గాలివానతో మటన్, చికెన్ షాప్, చర్చి, పెద్దమ్మ దేవాలయం వద్ద లేచిపోయిన రేకులను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌తో మాట్లాడి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.