NDL: బేతంచెర్ల మండలం రంగాపురం జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు (1993-96 బ్యాచ్) పాఠశాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించారు. పాఠశాలకు అవసరమైన స్పీకర్ సెట్, స్కానర్ ప్రింటర్‌ను ప్రధాన ఉపాధ్యాయుడు శేషాచలంకు అందజేశారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు ఈ సహాయం అందించడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు శ్రీనివాసులు రామా నరసింహారెడ్డి, తిమ్మయ్య తెలిపారు.