KDP: ముద్దనూరు సమీపంలోని కాయన వంక భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముద్దనూరు- పులివెందుల ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.