MBNR: నవాబుపేట్ మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఇందిరాదేవి ముదిరాజ్ 1994-1998 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాలమూరు జిల్లా గ్రామ దేవతలు అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆమె రచించిన గ్రామ దేవతల ఆచారాలు, వ్యవహారాలపై వ్యాసాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు పాఠ్యాంశంలో చేర్చిన సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.