NTR: రైల్వే ఉద్యోగులకు కనీస వేతనం రూ. 69 వేలు నిర్ణయించాలని ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానం రద్దు, 3.833 ఫిట్మెంట్, 5% ఇంక్రిమెంట్‌తో పాటు ప్రత్యేక అలవెన్సులు కల్పించాలని వేతన సంఘానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. రైల్వేలో సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు.