కడప జిల్లా ఎండోమెంట్ శాఖాధికారిగా పనిచేస్తున్న శంకర్ బాలాజీపై పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు దేవాలయాల సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి పుప్పాల వినతిపత్రం సమర్పించారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం, పరిపాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించినట్లు తెలిపారు.