WGL: దేవదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ డి. కృష్ణప్రసాద్‌ను వరంగల్‌కు బదిలీ చేశారు. అదనపు కమిషనర్ ఎం.ఎం.డి. కృష్ణవేణి ట్రైబ్యునల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. కె. జ్యోతి కమిషనర్ కార్యాలయానికి మారారు. పలువురు డిప్యూటీ ఈఈలు, ఇన్స్పెక్టర్లకు కూడా పరస్పర బదిలీలు జరిగాయి.