SKLM: రనస్థలం మండలం ఎర్రవరం పంచాయతీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు కలిసి ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.