ELR: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ కోర్టు రిమాండ్ విధించింది. కుక్కునూరు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. నిన్న జంగారెడ్డిగూడెం కోర్టులో ప్రవేశపెట్టగా 12వ తేదీ వరకు రిమాండ్ విధించారు.