NRML: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో దొంగ ఓట్లకు అవకాశం కల్పించి, ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా ఛైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. సోమవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును పరిరక్షించాలని పిలుపునిచ్చారు.