KDP: ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుష్పగిరి మాన్యానికి చెందిన పెద్దమాచుపల్లె ఆంజనేయులు(38) మృతి చెందాడు. భార్యను తీసుకురావడానికి ఆటోలో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.