ELR: ప్రతినెల 1న తెల్లవారుజామున నుంచి ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు ఆసరాగా ఉంటున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.