AP: నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోని మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలొచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.