NRML: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఆదివారం భారీ ఆదాయం సమకూరింది. సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, అర్జిత సేవలు, లడ్డు, పులిహోర ప్రసాదాలు, అభిషేకం టికెట్ల విక్రయాల ద్వారా ఒక్కరోజులోనే రూ. 10,88,075 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు.