SKLM: రణస్థలం పంచాయతీలో సూరమ్మకు మంజూరైన ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు సోమవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపడుతోందని తెలిపారు.