NTR: నందిగామలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద బ్రిడ్జి మునేటి తీరాన మామిడి తోటకు కాపలాగా ఉన్న ఆదాం(37) పాము కాటుకు గురై మృతి చెందాడు. కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన రాత్రి బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలించారు.