PDPL: గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక నాయకుల JAC ఆధ్వర్యంలో ఆదివారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా JAC ఛైర్మన్ వంగర శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా RTCని ప్రభుత్వంలో విలీన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి రాజేష్, నరేంద్ర చారి, తిరుపతి, TRరెడ్డి పాల్గొన్నారు.