NRML: జిల్లాలో 64,742 మంది రైతులకు రూ.588 కోట్ల రుణమాఫీ అమలయింది. ఇంకా 6,822 మంది రైతులు లబ్ధి కోసం ఎదురుచూస్తున్నారు. మరో 13,343 దరఖాస్తులు పరిశీలనలో ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆధార్ అనుసంధానం, సాంకేతిక సమస్యలు, రేషన్ కార్డ్ లోపాల కారణంగా వారికి ఇంకా రుణమాఫీ జరగకపోవడంతో ఎప్పుడు మాఫీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.