AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సోమవారం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకునే కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా వాటిని సురక్షితంగా తరలించారు. కుక్కల నియంత్రణ చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.