NLG: శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థలో ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. భవన పరిస్థితిపై ప్రజాప్రతినిధులు సమస్యను చేర్చడంతో, BNG ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి స్పందించారు. పీహెచ్సీ అత్యవసర మరమ్మతుల కోసం రూ. 5 లక్షల నిధులను మంజూరు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులు మంజూరు చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.