VSP: వేసవి దృష్ట్యా రోజురోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తలు వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. కాటన్ బట్టలు ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు టోపీ, గొడుగు వేసుకోవాలని సూచించారు.