AP: రాష్ట్రంలో ఇవాళ ఓ వైపు ఎండ, మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ATP, సత్యసాయి, KDP, అన్నమయ్య, CTR జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పింది. ఇతర జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లి ఆశ్రయం పొందాలని సూచించింది.