BHNG: ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారిగా పనిచేస్తున్న సుంకరనేని శ్రీనాథ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా శ్రీనాద్ కుటుంబ సభ్యులను జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆదివారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.