BHPL: చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఇటీవల ఇంటర్నెట్, డిష్ పనుల కోసం ఓ గుంతను తవ్వారు. అయితే పనులు పూర్తయ్యాక కూడా ఆ గుంతను పూడ్చకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి గుంతను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.