GNTR: రౌడీషీటర్లు తమ నేర స్వభావాన్ని వీడి, సమాజంలో మంచిగా బతకాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఆయన ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక పనులకు పాల్పడి జీవితాలను పాడుచేసుకోవద్దని హితవు పలికారు.