VZM: మెరకముడిదాం మండల YCP యువజన విభాగం నూతన కమిటీ నియామకాలు చేపట్టినట్లు మండల అధ్యక్షుడు కొమ్ము శంకరరావు తెలిపారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్ర అధ్యక్షుడిగా ముదునూరు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా చందక మురళీకృష్ణ, లెంక సంతోష్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. మండలంలో పార్టీ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు.