ELR: సుంకొల్లులో నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై జ్యోతి బసు తెలిపారు. వారి నుంచి రూ.5,470 నగదు, రెండు కోడిపుంజులు, రెండు కత్తులు, 4 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలో కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.