హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు HNK జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో వినతిపత్రాలు సమర్పించాలని సూచించారు. ప్రజావాణిలో సమర్పించే ప్రతి దరఖాస్తును త్వరగా పరిష్కరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.