GNTR: గుంటూరు ఛానల్ పొడిగింపునకు భూములిచ్చిన ఏడు గ్రామాల రైతులకు రెండో విడత పరిహారంగా రూ.17.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎనమదల, ప్రత్తిపాడు, గారపాడు, కొండేపాడు, మల్లాయపాలెం, జి.జి.పాలెం, రావిపాడు రైతులకు ఈ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయినట్లు పేర్కొన్నారు.