ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా 88వ చండీ హోమాన్ని అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ ఛైర్మన్ రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసారు. అమ్మ వారిని దర్శించి, చండీ హోమంలో పాల్గొన్నారు.