అన్నమయ్య: ములకలచెరువు మండలంలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన రామ్మోహన్రెడ్డి (22) అనే యువకుడు ఆదివారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాల్వపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.