VZM: 1979 జూన్ 2న శ్రీకాకుళం, విశాఖ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలిపి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. నాగావళి, గోస్తని, సువర్ణముఖి నదులు, అనంతగిరి అటవీ ప్రాంతాలు, చారిత్రక వారసత్వం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం నుంచి ప్రత్యేక కార్యక్రమాలపై ఎలాంటి ప్రకటన లేదు.