HNK: కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పూజ కార్యక్రమాల అనంతరం వీరభద్రస్వామి వారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.