TG: రాష్ట్రంలో మహిళా సంఘాల చైతన్యం కోసం ‘మహిళల మాటాముచ్చట’ పేరిట ప్రత్యేక రేడియో, యూట్యూబ్ ఛానళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ‘సెర్ప్’ ఈ బాధ్యతలు చేపట్టింది. అనుమతుల ప్రక్రియ వల్ల ముందుగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించనున్నారు. దీనిపై అధికారులు త్వరలోనే మంత్రికి నివేదిక సమర్పించనున్నారు.