WG: జిల్లాలో నేటి నుంచి పంట కాలువలకు సాగునీరు విడుదలవుతున్నా, అధికారుల నిర్లక్ష్యంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. భీమవరంలో ప్రవహించే కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. ప్లాస్టిక్ కుప్పలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఏర్పడి పంటలకు సాగునీరు అందడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.