KMM: నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (GHS) విద్యార్థి చిట్టంశెట్టి మహేశ్ బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సీటు సాధించి ప్రతిభ చాటాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మహేశ్‌ను అభినందించారు. మహేశ్ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.