GNTR: తెనాలి సబ్ డివిజన్ పోలీసు సిబ్బందికి జూన్ 1 నుంచి 3 వరకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు చావా గ్రాండ్లో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ యోగా తరగతుల్లో పోలీసు సిబ్బంది అందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.