PLD: నరసరావుపేట 24వ వార్డు ప్రశాంతి నగర్-3లో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తోందని తెలిపారు.