ప్రకాశం: కొండపిలో ప్రజలు కుక్కలతో బెంబేలెత్తుతున్నారు. వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను వెంటాడుతున్నాయి. భయాందోళనలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నామని వాపోతున్నారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళుతుంటే వారి వెంట కూడా పడుతున్నాయని వాకర్స్ వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.