AKP: మునగపాక, తిమ్మరాజుపేట గ్రామాల్లో టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను సోమవారం పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుని పింఛన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.