RR: ఫరూఖ్‌నగర్ మండలంలోని రామేశ్వరం కోనేరులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నందిగామ మండలం శ్రీనివాసులగూడ గ్రామానికి చెందిన జన్ముల సువర్ణ (45) మృతి చెందారు. పున్నమి సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆమె కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం. భక్తులు వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.