సినీ రంగంలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న హీరోయిన్ అదా శర్మ తన పాత్రల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. స్టూడెంట్ నుంచి కిల్లర్ వరకు ఎన్నో విభిన్న రోల్స్ చేశానని, కథను మనస్ఫూర్తిగా నమ్మితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పింది. అవార్డులు, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ కోసం కాకుండా.. ఆ పాత్ర తనను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే దానిపైనే నిర్ణయం తీసుకుంటానని అదా స్పష్టం చేసింది.